Abn logo
Sep 25 2021 @ 02:29AM

దిశ యాప్‌ కాల్‌ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

రికార్డులను పరిశీలిస్తున్న సెంథిల్‌కుమార్‌

చిత్తూరు, సెప్టెంబరు 24: దిశ యాప్‌ కాల్‌ సెంటర్‌ను శుక్రవారం ఎస్పీ సెంథిల్‌కుమార్‌ పరిశీలించారు. కాల్స్‌పై ఏ విధంగా స్పందించాలో.. కస్టమర్‌ సపోర్ట్‌ పర్సనల్స్‌తో మాట్లాడి సూచనలు, సలహాలు అందించారు. అక్కడ పనిచేసే సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దిశ పోలీస్‌ డీఎస్పీ బాబు ప్రసాద్‌, సీసీఎస్‌ డీఎస్పీ మూర్తి, చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, దిశ ఎస్‌ఐ మురళీ మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.