గోపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎస్పీ వెంకట్వేర్లు
గండీడ్, జూలై 2 : మహబూబ్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహించే గోపాల్‌రెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందగా, ఎస్పీ వెంకటేశ్వర్లు పరామర్శించారు. శనివారం మండల పరిధిలోని గోపాల్‌రెడ్డి స్వగ్రామమైన బల్సుర్‌గొండకు వెళ్లి నివాళులర్పించారు. వారికుటంబానికి పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని వారి భార్య, కుమారులకు తెలిపారు. ఎస్పీతో పాటు డీఎస్పీ మహేష్, సీఐ హన్మప్ప, స్థానిక ఎస్‌ఐ రవిప్రకాష్, పోలీసు సంఘం బాధ్యులు ఉన్నారు.