Abn logo
Sep 26 2021 @ 23:48PM

రాజు హత్య కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు

శ్రీనివాసపురంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 26: శ్రీనివాసపురంలో దళిత యు వకుడు ముప్పిడి రాజు హత్య కేసులో కొత్త విషయాలు తెలిశా యని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు. మృతుడు రాజు కుటుంబ సభ్యులను ఎస్పీ రాహు ల్‌దేవ్‌శర్మ ఆదివారం పరామర్శిం చారు. అతడి తల్లిదండ్రులతో ఏకాంతంగా మాట్లాడారు. అనంతరం రాజు మృతదేహం గుర్తించిన సూరయ్య చెరువు పరిసరాలను ఆయన పరిశీలించారు. ఆయన వెనుదిరిగి వెళుతుండగా ప్రజా, దళిత సంఘాల నాయకులు కలిసి అసలు నిందితులను అరెస్టు చేయాలని కోరారు. వారితోపాటు స్థానికులతో ఎస్పీ చర్చించా రు. ముప్పిడి రాజు పనిచేసిన రైతు పోల్నాటి రామకృష్ణ ఇంటి వద్దనే హత్య చేసి సూరయ్య చెరువులో పడేశారని, కేసును నీరుగారుస్తున్నారని ఎస్‌.రామ్మోహన్‌, తుర్లపాటి శ్రీనివాస్‌, కలపాల రాజ్‌కుమార్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్టు చేసిన శ్రీనివాస్‌కు సూరయ్య చెరువు సమీపంలో మిరప చేను లేదని, కానీ పోలీసులు శ్రీనివాస్‌ మిరప చేలోకి గేదెలు వదిలేయడంతో రాజుతో గొడవపడి హత్య చేసినట్టు చెప్పడం కేసు నీరుగార్చడమేనన్నారు. యజమాని రామకృష్ణ, ము ప్పిడి రాజు ఫోన్‌ కాల్‌ డేటా పరిశీలిస్తే అసలు విషయం బయట పడుతుంద న్నారు. కేసు విచారణ పారదర్శకంగా జరపాలని విచారణాధికారి, డీఎస్పీ ఓ.దిలీప్‌ కుమార్‌కు ఎస్పీ సూచించారు. ఆయన వెంట డీఎస్పీ బి.రవికిరణ్‌, సీఐ గౌరీశంకర్‌, ఎస్‌ఈబీ ఏఎస్పీ జయరామరాజు తదితరులు ఉన్నారు.