Abn logo
Jul 25 2021 @ 01:04AM

‘దిశ’తో మహిళలకు భద్రత: ఎస్పీ

మాట్లాడుతున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

మైలవరం, జూలై 24: మహిళలకు భద్రత కల్పించడమే దిశ యాప్‌ ముఖ్య ఉద్దేశ్యమని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ అన్నారు. లకిరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన దిశ యాప్‌పై అవగాహన సదస్సుకు ఎస్పీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలను సమర్థవంతంగా అరికట్టేందుకే ప్రభుత్వం దిశ యాప్‌ను ప్రవేశ పెట్టిందన్నారు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఉత్తమ సేవలందిస్తున్న మహిళా పోలీసులకు ప్రశంసా పత్రాలను అందించారు. మైలవరంలో హెల్మెట్‌ ధరించి మోటార్‌ బైక్‌ నడిపి హెల్మెట్‌ ఆవశ్యకతను ఎస్పీ తెలియజేశారు. డీఎస్పీ బి.శ్రీనివాసులు, సీఐ పి.శ్రీను, ఎస్సై పి.రాంబాబు, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.అప్పారావు, జి.కొండూరు ఎస్సై ఆర్‌.ధర్మరాజు పాల్గొన్నారు.