మహాదర్బార్‌లో పోలీసు సమస్యల పరిష్కారం

ABN , First Publish Date - 2021-07-26T06:54:17+05:30 IST

పోలీసులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ పేర్కొన్నారు.

మహాదర్బార్‌లో పోలీసు సమస్యల పరిష్కారం
మహాదర్బార్‌లో పోలీసు సిబ్బంది సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

మచిలీపట్నం టౌన్‌, జూలై 25 : పోలీసులు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని  ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన  అనంతరం మొదటి సారిగా పోలీసు కల్యాణ మండపంలో ఆదివారం మహాదర్బార్‌  నిర్వహించి సిబ్బంది సమస్యలను ముఖాముఖి తెలుసుకున్నారు. పలు సమస్యలకు పరిష్కార మార్గాలు చూపారు. దాదాపు 150 మంది అధికారులు, సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ ముందుంచారు.  బదిలీలు, పదోన్నతుల పెండింగ్‌, ఇతర సమస్యలను ఎస్పీకి విరించారు.  ఆయా సమస్యలపై సెక్షన్‌ ఉద్యోగులతో మా ట్లాడి కొన్నింటిని పరిష్కరించారు. మరి కొన్నింటిని సంబంధిత అధికారులకు పంపారు.  ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం  సేవాతత్పరతతో కూడిన బాధ్యత అన్నారు. సిబ్బంది సమస్యలుంటే తనకు చెప్పవచ్చన్నారు. ప్రతిరోజూ ఉదయం 12 నుంచి ఒంటిగంట వరకు ప్రజలకు స్పందన కార్యక్రమం నిర్వహిసు ్తన్నామన్నారు. ఇకపై మధ్యాహ్నం 1 గంటకు పోలీసుల సమస్యలను కూడా వింటామన్నారు. పోలీసులు శాఖాపరమైన అంశాలపై నిబద్ధతగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు. విధుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవన్నారు. సమస్యలను పారదర్శకంగా వచ్చి చెప్పుకునే అవకాశం ఇస్తున్నామన్నారు. పోలీసులు ధైర్యంగా విధులు నిర్వహించాలని, ప్రతి ఒక్క పోలీసుకు తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు. జిల్లాలోని పోలీసులందరికీ రోజుకు ఐదుగురు చొప్పున ఫోన్‌ చేసి సమస్యలు వింటామన్నారు. రహస్యంగా తెలియజేయాల్సి వస్తే తనకు చెప్పేందుకు అవకాశం ఉందన్నారు. ఏఆర్‌ ఏఎస్పీ సత్యనారాయణ, బందరు డీఎస్పీ మసుంబాషా, ట్రాఫిక్‌ డీఎస్పీ భరత్‌మాతాజీ, డీటీసీ డీఎస్పీ రమేష్‌,  ధర్మేంద్ర, ఏఆర్‌ డీఎస్పీ విజయకుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐలు శుభాకరరావు, శ్రీనివాసరావు, సీఐలు బీమరాజు, అంకబాబు, రమేష్‌, నరే్‌షకుమార్‌, కొండయ్య, ఆర్‌ఐలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, విజయసారధి, పోలీసు ఆసుపత్రి వైద్యురాలు జయశ్రీ, ఏవో మూర్తి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-26T06:54:17+05:30 IST