రాజమహేంద్రవరం సిటీ, జనవరి 20: మత సామరస్యానికి విఘాతం కలిగిస్తే సహించబోమని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షిమొషి బాజ్‌పాయ్ హెచ్చరించారు. రాజమహేంద్ర వరం దిశ పోలీసు స్టేషన్‌లో బుధవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజమహేంద్రవరం రూరల్ మం డలం పిడింగొయ్యి గ్రామ పరిధిలో వినాయకుడి విగ్రహానికి మాన వుని మలినం పూయడం అనేది వాస్తవం కాదని ఎఫ్‌ఎస్‌ఎల్, డీఎన్‌ఏ రిపోర్టులలో తేలిందన్నారు. ఈ ఘటనలో కొంతమంది ప్రజల మనోభావాలు దెబ్బతిసేవిధంగా సోషల్ మీడియాలో పోస్టిం గ్‌లు పెట్టారని, దీనిపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులో సెక్షన్ 177 ఆర్/డబ్ల్యు 34 ఐపీసీ కింద సందీప్, వి ప్రసాద్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతోందని, మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. అర్బన్ జిల్లాలో 1,368 దేవాలయాలు, 721 చర్చిలు, 66 మసీదులు ఉన్నాయని.. వాటిన్నింటిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని, ఆయా కమిటీలకు సూచించామన్నారు.