ఒత్తిడిని జయిస్తేనే జీవితంలో రాణించగలం

ABN , First Publish Date - 2022-05-24T05:15:00+05:30 IST

ధి నిర్వహణతో పాటు, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడిని జయిస్తేనే జీవితంలో రాణించగలమని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు.

ఒత్తిడిని జయిస్తేనే జీవితంలో రాణించగలం
సదస్సులో మాట్లాడుతున్న ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

- ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

గద్వాల క్రైం, మే 23 : విధి నిర్వహణతో పాటు, వ్యక్తిగత జీవితంలో ఒత్తిడిని జయిస్తేనే జీవితంలో రాణించగలమని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు.  భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ‘హౌటు ఓవర్‌కమ్‌ స్ర్టెస్‌’ అంశంపై వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల పోలీసు అధికారులకు జిల్లాకేంద్రంలోని హిమాలయ హోటల్‌ బంక్వెట్‌హాల్‌లో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో, కుటుంబపరంగా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొ నే పోలీసులు దానిని ఎలా జయించాలో తెలియ జేసేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు పోలీసుల నుంచి ఏమి ఆశిస్తున్నారు, వారి అంచనాలను మనం ఎలా అందుకోవాలనే అంశాలను తెలుసుకోవాలని చెప్పారు. సమస్యలు వచ్చినప్పుడు మానసిక స్థైర్యంతో ఎలా ఎదుర్కోవాలో, భావోద్వేగా లను తమ ఆధీనంలో ఎలా ఉంచుకోవడం ఈ శిక్షణ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఇంపాక్ట్‌ ట్రైనర్‌ రవీంద్ర ధీర మాట్లాడుతూ మనిషిలో ఒత్తిడి కలిగించేందుకు అవకాశం ఉన్న అంశాలను, దానిని ఎదుర్కొవడంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ట్రైనర్‌ తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ.. మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎలాంటి వారితో ఎలా మెలగాలి అనే విషయాలను వివరించారు. కార్యక్రమంలో వనపర్తి అదనపు ఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌, గద్వాల డీఎస్పీ రంగస్వామి, వనపర్తి డీఎస్పీ ఆనందరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-05-24T05:15:00+05:30 IST