అన్ని పనులపై అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2021-04-08T05:22:38+05:30 IST

పోలీస్‌స్టేషన్లలోవిధులు నిర్వహించే సిబ్బందికి అన్ని పనులపై పూర్తి అవగాహన కల్గి ఉండాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు.

అన్ని పనులపై అవగాహన ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రంజన్‌ రతన్‌ కుమార్‌

- సమావేశంలో ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

    గద్వాలక్రైం, ఏప్రెల్‌ 7 : పోలీస్‌స్టేషన్లలోవిధులు నిర్వహించే సిబ్బందికి అన్ని పనులపై పూర్తి అవగాహన కల్గి ఉండాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహించే సిబ్బందికి అవగాహన కల్పించేందుకు పీసీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ ఆధ్వర్యంలో ఐటీసెల్‌ విభాగానికి చెందిన నాగరాజు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పోలీస్‌ స్టేషన్లలోని రిసెప్షన్‌, స్టేషన్‌రైటర్స్‌, క్రైమ్‌ రైటర్స్‌, బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్స్‌, కోర్టు, వారెంట్‌, సమన్స్‌, జనరల్‌ డ్యూటీ వంటి పనులపై పూర్తి సిబ్బంది పూర్తి అవగాహన కల్గి ఉండాలన్నారు. స్వీకరించిన ఫిర్యాదులను అన్‌లైన్‌లో నమోదు చేయాలని, పిటిషన్‌ మేనేజ్‌మెంట్‌ తదితర విషయాలను తెలుసుకోవాలన్నారు. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు అందరూ సహకరించాలన్నారు. 


Updated Date - 2021-04-08T05:22:38+05:30 IST