ఆస్తి సంబంధిత నేరాలకు అడ్డుకట్ట వేయాలి

ABN , First Publish Date - 2021-11-28T05:19:33+05:30 IST

జిల్లాలో ఆస్తి సంబంధిత నేరాలకు అడ్డుకట్ట వేయాలని, గం జాయి, ఖైనీ, గుట్కా, ఇసుక, మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ ఆదేశించారు.

ఆస్తి సంబంధిత నేరాలకు అడ్డుకట్ట వేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

గంజాయి, ఖైనీ, గుట్కా, ఇసుక, మద్యం అక్రమ రవాణా అరికట్టాలి

జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ఆదేశం

ఏలూరు క్రైం, నవంబరు 27 : జిల్లాలో ఆస్తి సంబంధిత నేరాలకు అడ్డుకట్ట వేయాలని,  గం జాయి, ఖైనీ, గుట్కా, ఇసుక, మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ ఆదేశించారు. ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం  శనివా రం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ అంత ర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో వున్న నేరచరిత కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. ప్రతి పోలీస్‌ అధికారి తమ స్టేషన్‌ పరిధిలోని గ్రామాలను సందర్శించి ప్రజా సమస్యలను తెలుసుకోవాలన్నారు. చిన్న చిన్న సమస్యలుగా ఉన్నప్పుడే వాటిని పరిష్కరించాలని సూచించారు. సకాలంలో సాక్ష్యాలను కోర్టుకు హాజరుపర్చి ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తామని, సిబ్బంది అవినీతి కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు తెలుసుకుని వాటికి సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా ఉన్నత ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ జయరామరాజు, స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ రమేష్‌రెడ్డి, ఏలూరు డీఎస్పీ డాక్టరు దిలీప్‌కిరణ్‌, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:19:33+05:30 IST