అమరవీరుల కుటుంబ సంక్షేమానికి పెద్దపీట

ABN , First Publish Date - 2021-10-23T06:26:56+05:30 IST

పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తామని ఎస్పీ రవీంద్రనాధ్‌బాబు తెలిపారు. శుక్రవారం పోలీసు అమరవీరుల కుటుంబసభ్యుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు.

అమరవీరుల కుటుంబ సంక్షేమానికి పెద్దపీట
పోలీసు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎస్పీ రవీంద్రనాధ్‌బాబు

కాకినాడ క్రైం, అక్టోబరు 22: పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తామని ఎస్పీ రవీంద్రనాధ్‌బాబు తెలిపారు. శుక్రవారం పోలీసు అమరవీరుల కుటుంబసభ్యుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉంటానని, ప్రభుత్వపరంగా రావాల్సిన రాయితీలు, ఇతర సౌకర్యాలు వచ్చేలా కృషి చేస్తానని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఎస్‌ఐ సీహెచ్‌ దేవకీరావు, సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడి అమరుడైన ఏఆర్‌పీసీ దుర్గాప్రసాద్‌ కుటుంబసభ్యుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఓపెన్‌హౌస్‌ కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. ఆయుధాల వినియోగం, పోలీసుల విధులు, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, కమ్యూనికేషన్‌ విధానంపట్ల అవగాహన కల్పించడం చేశామని ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు కాకినాడ సబ్‌ డివిజన్‌ పరిధిలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీహెచ్‌ సూర్యప్రసాదరావు, కె.విజయలక్ష్మి, అమలాపురం ఎస్‌డీపీవో పరిధిలో ఏఎస్‌ఐ పీవీఎస్‌ఎన్‌ మూర్తి, పెద్దాపురం పరిధిలో ఎల్‌.సత్యనారాయణలను సంబంధిత ఎస్‌డీపీవోలు పరామర్శించారు.

Updated Date - 2021-10-23T06:26:56+05:30 IST