హైవేలపై వాహనాలు నిలపొద్దు

ABN , First Publish Date - 2022-05-20T06:15:19+05:30 IST

జిల్లాలో రహదారులపై రోడ్డు సేప్టీ హైవే మొబైల్‌ సిబ్బంది రాత్రీ పగలు గస్తీ నిర్వహిస్తూ వాహన చోదకులకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఆదేశించారు.

హైవేలపై వాహనాలు నిలపొద్దు

వాహనదారులకు అవగాహన కల్పించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ 

ఏలూరు క్రైం, మే 19 : జిల్లాలో రహదారులపై రోడ్డు సేప్టీ హైవే మొబైల్‌ సిబ్బంది రాత్రీ పగలు గస్తీ నిర్వహిస్తూ వాహన చోదకులకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఆదేశించారు. ఏలూరు జిల్లా పోలీసు కార్యాల యం నుంచి జిల్లాలోని హైవే పరిధిలోని 15 పోలీస్‌ స్టేషన్ల అధికారులతో వీడియో కాన్ఫ రెన్స్‌ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసు కోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అవగాహన, సమీక్ష నిర్వహిం చారు. ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, అదనపు ఎస్పీ కె.చక్రవర్తి మాట్లాడుతూ రాత్రి వేళ జాతీ య రహదారిపై బ్లాక్‌ స్పాట్‌ పాయింట్ల వద్ద వాహనదా రులను అప్రమత్తం చేయాలని, అందరి సహకారంతో ప్రమా దాలు నివారించాలి. బాదం పూడి, ఆశ్రం ఆసుపత్రి జంక్షన్‌, నాచుగుంట, అమ్మపాలెం పెట్రోల్‌ బంక్‌ల వద్ద ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. జాతీ య రహదారిపై వాహనాలు నిలపకుండా చూడాలి. దాబాలు నిర్దేశించిన సమయానికి మూసి వేయాలి. వ్యతిరేక దిశలో వాహ నాల ప్రయాణాలను నియం త్రించాలి. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ వాడకం వల్ల కలిగే ఉపయో గాలు తెలపాలి.  పోలీసులు, ఏఆర్‌, ఇతర సిబ్బంది అందరూ హెల్మెట్‌లు ధరించి నిబంధన లు పాటించాలన్నారు.  పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T06:15:19+05:30 IST