Modi Governmentపై అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-04-30T18:05:02+05:30 IST

కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా

Modi Governmentపై అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం

లక్నో : కోవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ అసమర్థత వల్ల దేశ ప్రతిష్ఠ మసకబారిందని ఆరోపించారు. మన దేశంలో కోవిడ్ సంబంధిత మరణాలపై అంతర్జాతీయ పత్రికలు ప్రచురిస్తున్నాయని పేర్కొన్నారు. 


అఖిలేశ్ యాదవ్ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘బీజేపీ ప్రభుత్వ తప్పుడు నిర్వహణ వల్ల కోవిడ్ సంబంధిత మరణాలు ప్రపంచవ్యాప్తంగా వార్తా పత్రికలు, మ్యాగజైన్లలో వస్తున్నాయి. అంతర్జాతీయంగా మన దేశ  ప్రతిష్ఠ మసకబారుతోంది. బహిరంగంగా అబద్ధాలు చెప్తున్నవారు ఇప్పుడు ఆ ప్రచురణ సంస్థల ఆస్తులను జప్తు చేస్తున్నారు, లేదంటే వాటిపై ఆంక్షలు విధిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. 


మన దేశంలో కోవిడ్-19 కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ ఒకటి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఉత్తర ప్రదేశ్‌లో 3,09,237 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. 8,96,477 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. 12,238 మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-04-30T18:05:02+05:30 IST