పాట ఎక్కడో... నాన్న అక్కడే!

ABN , First Publish Date - 2021-03-08T05:18:37+05:30 IST

పాట ఎక్కడ ఉందో... నాన్న అక్కడ ఉన్నారు. నాన్న లేకుండా నాన్న ఊరిలో తొలిసారిగా పాట పాడుతున్నానంటూ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్‌ కంటతడి పెట్టుకున్నారు.

పాట ఎక్కడో... నాన్న అక్కడే!
పాట పాడుతున్న చరణ్‌

బాలు కుమారుడు ఎస్పీ చరణ్‌

స్వర నీరాజనంలో కంటతడి


నెల్లూరు(సాంస్కృతిక, ప్రతినిధి), మార్చి 7 : పాట ఎక్కడ ఉందో... నాన్న అక్కడ ఉన్నారు. నాన్న లేకుండా నాన్న ఊరిలో తొలిసారిగా పాట పాడుతున్నానంటూ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్‌ కంటతడి పెట్టుకున్నారు. కళాంజలి అనంత్‌ సాంస్కృతిక సంస్థ ఆదివారం నెల్లూరు టౌనుహాలులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృత్యకంగా సినిమా, టీవీ గాయకులతో స్వరనీరాజనం కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్‌ మాట్లాడుతూ నాన్న లేకుండా పాడుతుంటే గుండెల్లో దడపుడుతోందన్నారు. ఏ పాట పాడినా నాన్నే గుర్తుకు వస్తారని,  సంగీత ప్రపంచం ఉన్నంత కాలం నాన్న జీవించే ఉంటారన్నారు. ముఖ్య అతిఽథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఎస్పీ బాలుతో తనకున్న ఆత్మీయ స్నేహాన్ని నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌  ఎల్‌ విజయకృష్ణారెడ్డి, తుంగా శివప్రభాత్‌రెడ్డి, వీరిశెట్టి హజరత్‌బాబు, కళాంజలి అనంత్‌, బెనర్జి తదితరులు పాల్గొన్నారు. గాయకులు నరసింహ, జ్ఞానశ్రీ, శిరీష, అనూష, మమ తదితరులు ఎస్పీ బాలు ఆలపించిన పాటలతో అభిమానులు, సంగీత ప్రియులను అలరించారు. 

Updated Date - 2021-03-08T05:18:37+05:30 IST