Abn logo
Sep 26 2020 @ 21:51PM

తెలుగు భాషపై బాలుకి ఎంత మక్కువ అంటే.. ?

Kaakateeya

ఎస్‌. పి. బాలు ఇక లేరు. ఇక ఆయన జ్ఞాపకాలు, పాడిన పాటలు మాత్రమే మనతో ఉంటాయి. ఆయన లేరని తలచుకుంటుంటే దుఃఖం తన్నుకొస్తుంది. ఒక్క భాష కాదు.. సుమారు 16 భాషలలో, ఆ భాషలు మాట్లాడే ప్రజలకి.. ఏదో ఒక సందర్భంలో ఆయన గుర్తుకు వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒకటికాదు, రెండు కాదు.. 40 వేల పాటలు ఆయన గాత్రం నుంచి రూపుదిద్దుకున్నాయి. ఇక ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆ భాషను ప్రేమించేవారు. ముఖ్యంగా తెలుగులో ఆయన కీర్తి అజరామరం. పాడుతా తీయగా అంటూ.. ఎందరో సింగర్స్‌కి ఆయన జీవితాన్ని ప్రసాదించారు.


ఇటీవల ఆయన తెలుగులో ఓ కచేరిని నిర్వహించిన విషయం తెలిసిందే. ఏసుదాస్‌, చిత్రలతో కలిసి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ కచేరి జరిగింది. అయితే ఈ కచేరికి ముందు దీనికి సంబంధించిన విశేషాలు తెలిపేందుకు మీడియా సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఓ ఇంగ్లీష్‌ డైలీకి చెందిన రిపోర్టర్‌.. ఇంగ్లీష్‌లో మాట్లాడుతుండగా.., నీది ఏ పేపర్‌ అయినా సరే తెలుగు వచ్చుగా.. నువ్వు ఇంగ్లీష్‌లో రాసుకో.. కానీ ఇక్కడ తెలుగులోనే మాట్లాడు..అని రిపోర్టర్‌కు చెప్పారు. ఆ తర్వాత ఆ రిపోర్టర్‌ చక్కగా తెలుగులో మాట్లాడారు. ఈ సందర్భం ఒక్కటి చాలు.. ఆయన భాషకు ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి తెలియడానికి. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.


Advertisement
Advertisement
Advertisement