తప్పుడు పోస్టింగులు పెడి తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-09-30T11:28:59+05:30 IST

జమ్మలమడుగులోని ఆంజనే యస్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని సోషల్‌ మీడియాలో ..

తప్పుడు పోస్టింగులు పెడి తే కఠిన చర్యలు

ఆంజనేయస్వామి ఆలయంలో వర్షం వల్లే గుంత : ఎస్పీ 


కడప (క్రైం), సెప్టెంబరు 29 : జమ్మలమడుగులోని ఆంజనే యస్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టింగులు పెట్టారని ఇలాంటివి పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జమ్మలమడుగు మండలం పొన్నతోట గ్రామంలోని పురాతన ఆంజనేయ, వినాయకస్వామి దేవాలయంలో వర్షం వల్ల గుంత ఏర్పడిందే తప్ప గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపలేదని తెలిపారు. ఒకరిద్దరు సోషల్‌ మీడియాలో ఆలయంలో గుప్తనిధుల కోసం గుంతలు తీశారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అక్కడున్న రిటైర్డ్‌ వీఆర్వో సుబ్బరాయుడు బండల మధ్యలో రంధ్రాన్ని గమనించి అదే గ్రామానికి చెందిన సుబ్బారెడ్డితో పాటు పలువురికి చెప్పడంతో వారు ఆ బండలను తొలగించి పెద్ద రంధ్రాన్ని గమనించారన్నారు.


గతంలో అక్కడ కాల్వ ఉండడంతో ఆ పెద్ద గుంత నుంచి ఓ కాల్వ మాదిరి బయటకు ఉందే తప్ప ఎవరు కూడా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపలేదని స్పష్టం చేశారు. రంధ్రం కనబడితే జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశ్యంతో గ్రామస్తులే బండలు తొలగించినట్లు చెప్పారు. ఇలాంటి అసత్య ప్రచారాలను సోషల్‌ మీడియాలో పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని, అసత్య పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

Updated Date - 2020-09-30T11:28:59+05:30 IST