క్వారీ ఘటన, అనుమతులపై విచారిస్తున్నాం: ఎస్పీ అన్బురాజన్

ABN , First Publish Date - 2021-05-08T21:42:27+05:30 IST

కడప జిల్లాలోని మామిళ్లపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో శనివారం జరిగిన పేలుడులో 10 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే.

క్వారీ ఘటన, అనుమతులపై విచారిస్తున్నాం: ఎస్పీ అన్బురాజన్

కడప: కడప జిల్లాలోని మామిళ్లపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో  శనివారం జరిగిన పేలుడులో 10 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. ఈ ఘటన జరిగిన స్థలాన్ని ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. పేలుడు ఘటనలో 10 మంది చనిపోయినట్లు గుర్తించినట్లు తెలిపారు. 5 మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. మరో 5 మృతదేహాల కోసం చుట్టుపక్కల గాలిస్తున్నామని చెప్పారు. ఘటన, క్వారీ అనుమతులపైన విచారిస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం పూర్తివివరాలు తెలియజేస్తామని ఎస్పీ అన్బురాజన్  పేర్కొన్నారు. 


జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కలసపాడు మండలంలో మామిళ్లపల్లె గ్రామ శివారులో ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించింది. ముగ్గు రాళ్ల గనిలో ఉన్న 10 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ముగ్గురాళ్లను తొలగించడానికి పేలుడు పదార్థాలను వినియోగించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

Updated Date - 2021-05-08T21:42:27+05:30 IST