Abn logo

సోయాబీన్‌ కర్రీ

కావలసినవి: నల్ల సోయాబీన్‌ - పావుకేజీ, బియ్యప్పిండి - కొద్దిగా, వేగించిన ఎండు మిర్చి - నాలుగు, వెల్లుల్లి - నాలుగైదు రెబ్బలు, పసుపు - ఒక టీస్పూన్‌, గరంమసాలా - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, ఆవాల నూనె - మూడు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం: స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి సోయబీన్స్‌ వేసి వేగించుకుని దింపాలి. కాస్త వేడిగా ఉండగానే గింజలను దంచుకోవాలి. తరువాత అందులో బియ్యప్పిండి వేసి కలపాలి. ఇప్పుడు  స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేయాలి. బియ్యప్పిండి కలిపిన సోయాబీన్స్‌ మిశ్రమం వేసి కలపాలి. పసుపు, గరంమసాల, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. వేగించిన ఎండుమిర్చితో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి. అన్నంలోకి ఇది రుచిగా ఉంటుంది.


బ్లాక్‌ సోయాబీన్‌లో...

క్యాలరీలు - 402

ప్రోటీన్లు - 33.6 గ్రా

కార్బోహైడ్రేట్లు - 36.4 గ్రా


సోయా బీన్‌ ఆలూ కూర్మాకీటో బటర్‌ పనీర్‌ మునగకాయ థోరన్‌cauliflower కర్రీపనీర్‌ కోఫ్తే కా సలాన్‌షాహీ పనీర్‌మసూర్‌ దాల్‌ కర్రీవంకాయ కొత్తిమీర కారం కూరథాయ్‌ గ్రీన్‌ కర్రీడుబ్కీ వాలే ఆలూ
Advertisement