Abn logo

సోయా బీన్‌ ఆలూ కూర్మా

కావలసిన పదార్థాలు: ఉల్లిగడ్డ ముక్కలు - రెండు కప్పులు, ఆలు గడ్డ ముక్కలు- కప్పు, సోయా చంక్స్‌- 100 గ్రాములు, జీలకర్ర- అర స్పూను, పచ్చి మిర్చీ- రెండు, ధనియాల పొడి, ఆవాల పొడి- చెరో స్పూను, కారం, పసుపు - అర స్పూను, గరమ్‌ మసాలా పొడి- అర స్పూను, అల్లంవెల్లుల్లి పేస్టు- అర స్పూను, మిరియాలు- పది, చెక్క- ఒకటి, పెరుగు- అర కప్పు, టొమాటో ప్యూరీ- కప్పు, ఉప్పు, నూనె, నీళ్లు - తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా సోయాను ఉడికించి నీళ్లన్నిటినీ తొలిగించి, నూనెలో వేయించి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిని కూడా దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఓ పాన్‌లో నూనె వేసి జీలకర్ర, చెక్క, పచ్చి మిర్చి, మిరియాలు వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కూడా జతచేయాలి. రెండు నిమిషాల తరవాత టొమాటో ప్యూరీ, పొడులు వేసి బాగా కలపాలి. ఆ తరవాత పెరుగు కూడా వేయాలి. అన్ని పదార్థాలు బాగా కలిసిపోయాక సోయా, ఆలూ ముక్కలు వేసి ఉప్పు వేసి మూతపెట్టాలి. రెండు విజిల్స్‌ తరవాత స్టవ్‌ కట్టేస్తే సోయా బీన్‌ ఆలూ కూర్మా రెడీ.

కరివేపాకు చట్నీకరివేపాకు కర్రీచోలే రాజ్మా కర్రీకీటో బటర్‌ పనీర్‌ మునగకాయ థోరన్‌cauliflower కర్రీపనీర్‌ కోఫ్తే కా సలాన్‌షాహీ పనీర్‌మసూర్‌ దాల్‌ కర్రీవంకాయ కొత్తిమీర కారం కూర
Advertisement