సోయా కట్‌లెట్‌

ABN , First Publish Date - 2020-02-09T20:56:29+05:30 IST

మీల్‌మేకర్‌ - ఒక కప్పు, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి - 6 రేకలు, పచ్చిమిర్చి - 3, ఉల్లిపాయ - 1, పసుపు - అర టీ స్పూను, ధనియాల పొడి, కారం - ఒక టీ స్పూను చొప్పున, గరం మసాలా - ఒకటిన్నర టీ స్పూను,

సోయా కట్‌లెట్‌

కావలసిన పదార్థాలు: మీల్‌మేకర్‌ - ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, కార్న్‌ఫ్లోర్‌ - 3 టేబుల్‌ స్పూన్లు, మైదా - 2 టేబుల్‌ స్పూన్లు, కశ్మీర్‌ కారం - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.

ఇతర పదార్థాలు: నూనె - 3 టీ స్పూన్లు, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను, ఉల్లి తరుగు - 3 టేబుల్‌ స్పూన్లు, ఉల్లి కాడల తరుగు - 4 టేబుల్‌ స్పూన్లు, క్యాప్సికం తరుగు - అరకప్పు, చిల్లీ సాస్‌ - ఒక టేబుల్‌ స్పూను, వెనిగర్‌ - ఒక టేబుల్‌ స్పూను, టమోటా సాస్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, సోయా సాస్‌ - ఒక టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా.

తయారుచేసే విధానం: ముందుగా వేడి నీటిలో మీల్‌ మేకర్‌ని 20 నిమిషాలు నానబెట్టి, నీరు పిండి బరకగా రుబ్బాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, మైదా, కార్న్‌ఫ్లోర్‌, కారం, ఉప్పుతో పాటు కొద్దిగా నీరుపోసి ముద్దగా చేయాలి. తర్వాత చిన్న ఉండలుగా చేసి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. మరో కడాయిలో 3 టేబుల్‌ స్పూన్ల నూనె వేసి వెల్లుల్లి, ఉల్లి, ఉల్లి కాడల తరుగు, క్యాప్సికం వేగించాలి. తర్వాత చిల్లీసాస్‌, వెనిగర్‌, సోయాసాస్‌, టమోటా సాస్‌, ఉప్పు వేసి మరికొద్దిసేపు వేగించి మంట పెంచి సోయా ఉండలు వేసి బాగా కలపాలి. చివరగా ఉల్లి కాడలతో అలంకరించాలి.  

Updated Date - 2020-02-09T20:56:29+05:30 IST