కేరళకు 1 నుంచి నైరుతి రుతుపవనాలు

ABN , First Publish Date - 2020-05-29T07:40:55+05:30 IST

భానుడి ప్రతాపం అల్లాడిపోతున్న దేశవాసులకు వాతావరణ శాఖ(ఐఎండీ) శుభవార్త చెప్పింది. వచ్చే 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని గురువారం ప్రకటించింది. జూన్‌ 5న వస్తాయని తొలుత అంచనా వేసినప్పటికీ.. బంగాళాఖాతంలో తుఫాను సంచారంతో వేగం పుంజుకున్నాయని...

కేరళకు 1 నుంచి నైరుతి రుతుపవనాలు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే 28: భానుడి ప్రతాపం అల్లాడిపోతున్న దేశవాసులకు వాతావరణ శాఖ(ఐఎండీ) శుభవార్త చెప్పింది. వచ్చే 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని గురువారం ప్రకటించింది. జూన్‌ 5న వస్తాయని తొలుత అంచనా వేసినప్పటికీ.. బంగాళాఖాతంలో తుఫాను సంచారంతో వేగం పుంజుకున్నాయని పేర్కొంది. వాతావరణం అనుకూలిస్తే 6, 7 తేదీలకల్లా రాయలసీమకు నైరుతి విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. కాగా, విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు కొనసాగిన ఉపరితలద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన గాలులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో రానున్న మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. 


Updated Date - 2020-05-29T07:40:55+05:30 IST