ఇంటి నుంచి పనికి దక్షిణాది అనుకూలం

ABN , First Publish Date - 2020-04-09T06:09:16+05:30 IST

లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల ఇంటి నుంచే పని చేసేందుకు దక్షిణాదిలో మరింతగా అవకాశం ఉన్నదని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) ఒక అధ్యయన...

ఇంటి నుంచి పనికి దక్షిణాది అనుకూలం

  • ఐఎస్‌బీ అధ్యయనం నివేదిక

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల ఇంటి నుంచే పని చేసేందుకు దక్షిణాదిలో మరింతగా అవకాశం ఉన్నదని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) ఒక అధ్యయన నివేదికలో తెలిపింది. ఇప్పటికే వివిధ పరిశ్రమల్లో పని చేస్తున్న వృత్తి నిపుణులు ఇంటి వద్ద నుంచే పని (డబ్ల్యూఎ్‌ఫహెచ్‌) చేస్తున్నారు.


వాస్తవానికి లాక్‌డౌన్‌ వల్ల అతి తక్కువగా ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రాంతం దక్షిణాది అని ఐఎ్‌సబీలోని ఎకనమిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ విభాగం ఫ్యాకల్టీ  శేఖర్‌ తోమర్‌ తెలిపారు. దాదాపు 100 వృత్తుల్లో ఉన్న 3,000 మంది వర్కర్లపై అధ్యయనాన్ని నిర్వహించారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇండెక్స్‌ (డబ్ల్యూఎ్‌ఫఐ), హ్యూమన్‌ ప్రాక్సిమిటీ ఇండెక్స్‌ (పీఐ) లను రూపొందించి వర్కర్లు, వృత్తినిపుణులపై లాక్‌డౌన్‌ ప్రభావాన్ని అంచనా వేశారు. అధ్యయనం ద్వారా ఆర్థికపరమైన ప్రభావాన్ని కూడా అంచనా వేశారు. హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సూచీలో పైన ఉన్నట్లు చెప్పారు. 


Updated Date - 2020-04-09T06:09:16+05:30 IST