వెడ్డింగ్ డిజైన్స్‌లో యంగ్ హీరోలు.. ఏమున్నార్రా బాబూ!

టాలీవుడ్‌లో స్టైల్ ఐకాన్‌గా ఒకప్పుడు పవన్ కల్యాణ్‌కి, ఇప్పుడు అల్లు అర్జున్‌కి భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు పవన్ కల్యాణ్ ఏం చేస్తే అది చేస్తూ.. అభిమానులు సృష్టించిన కోలాహలం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఏకంగా ఐకాన్ స్టారే అయ్యాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఒక్కరనే కాదు ప్రతి ఒక్కరూ.. ముఖ్యంగా సౌత్ హీరోలు స్టైల్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. హీరోలుగానే కాకుండా మోడల్స్‌గానూ తమ టాలెంట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ వేసే డ్రస్సులపై మాములుగా చర్చలు జరగవు. ఆయన ఏది వేసినా ట్రెండ్ సృష్టించడం ఖాయం. విజయ్ దేవరకొండే కాదు.. సౌత్‌లో అల్లు శిరీష్, దుల్కర్ సల్మాన్ వంటి వారి స్టైలింగ్ కూడా వైరల్ అవుతోంది. వెడ్డింగ్ డిజైన్స్‌ ధరించిన ఈ ముగ్గురి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. 

ఈ ఫొటోల్లో అల్లు శిరీష్ వైట్ అండ్ వైట్ ధరించి మెరిసిపోతున్నాడు. వైట్ చుడిదార్, దుప్పట్టా కాంబినేషన్‌లో వేసుకున్న వైట్ షర్వానీ పెళ్లికి పర్ఫెక్ట్ మ్యాచ్ అనేలా ఉంది. గోల్డెన్ కప్స్, కాలర్స్‌తో పాటు బ్రౌన్ కలర్ షూస్‌తో పెళ్లి కొడుకులా మెరిసిపోతున్నాడు శిరీష్. మరో హీరో దుల్కర్ సల్మాన్ కూడా వైట్ కలర్ చుడిదార్ కాంబినేషన్‌లో ఉన్న మెరూన్ కలర్ షర్వాని ధరించాడు. దానికి గోల్డెన్ బటన్స్ మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఇది కూడా పర్ఫెక్ట్ వెడ్డింగ్ క్యాస్ట్యూమ్ అని చెప్పుకోవచ్చు. ఇక విజయ్ దేవరకొండ వేయని డిజైన్ అంటూ ఉండదు. కానీ వైట్ కుర్తా, వైట్ చుడిదార్ కాంబినేషన్‌లో పింక్ షర్వానిలో ఉన్న విజయ్ దేవరకొండ లుక్ వావ్.. అనేలా ఉంది. వీరే కాదు.. ఇంకా యంగ్ హీరోలందరూ ఈ మధ్య ఇటువంటి వెడ్డింగ్ డిజైన్స్‌ లుక్‌లో కనిపిస్తూ.. అభిమానులను ఫిదా చేస్తున్నారు.

Advertisement