దక్షిణ కోస్తాలో చెదురుమదురు వర్షాలు

ABN , First Publish Date - 2022-01-01T01:44:45+05:30 IST

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సముద్రం మీదుగా తమిళనాడు, దానికి ఆనుకుని కోస్తాపైకి తూర్పుగాలులు వీస్తున్నాయి.

దక్షిణ కోస్తాలో చెదురుమదురు వర్షాలు

విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సముద్రం మీదుగా తమిళనాడు, దానికి ఆనుకుని కోస్తాపైకి తూర్పుగాలులు వీస్తున్నాయి. దీంతో దక్షిణ కోస్తాలో శుక్రవారం చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఏజెన్సీ, శివారు ప్రాంతాల్లో చలి స్వల్పంగా పెరిగింది. అనేకచోట్ల దట్టంగా మంచు కురిసింది. శుక్రవారం కళింగపట్నంలో 16.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2022-01-01T01:44:45+05:30 IST