అక్కడ కూడా కరోనా విలయం మొదలైంది : డబ్ల్యూహెచ్‌వో

ABN , First Publish Date - 2020-05-24T03:46:45+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తున్న కొవిడ్-19 మహమ్మారి ఇప్పుడు దక్షిణ అమెరికా...

అక్కడ కూడా కరోనా విలయం మొదలైంది : డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తున్న కొవిడ్-19 మహమ్మారి ఇప్పుడు దక్షిణ అమెరికా కేంద్రంగా విలయ తాండవం చేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రత్యేకించి ఈ ప్రాణాంతక వైరస్ ప్రభావం బ్రెజిల్‌పై అధికంగా పడినట్టు తెలిపింది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నారనీ.. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ధ్రువీకరించారని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. కాగా బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 20 వేలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. 

Updated Date - 2020-05-24T03:46:45+05:30 IST