అట్టబొమ్మలే అతిథులైన వేళ.. ప్రియురాలిని పెళ్లాడిన డైరెక్టర్!

ABN , First Publish Date - 2020-04-10T23:10:43+05:30 IST

కరోనా వైరస్.. ప్రపంచంలో విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే వేలాది మందిని

అట్టబొమ్మలే అతిథులైన వేళ.. ప్రియురాలిని పెళ్లాడిన డైరెక్టర్!

జోహన్స్‌బర్గ్: కరోనా వైరస్.. ప్రపంచంలో విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే వేలాది మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి.. నూతన సంవత్సరంలో కొత్త జీవితాలు ప్రారంభించాలనుకున్న యువతీ, యువకుల ఆశల్ని అడియాసలు చేసింది. కోరుకున్న వారిని పెళ్లి చేసుకుందామనుకున్న.. వారి కలలను కొవిడ్-19 చిన్నాభిన్నం చేసింది. ఫిల్మ్ డైరెక్టెర్ డాన్ మాస్(30) కథ కూడా ఈ కోవకు చెందిందే. సౌత్ ఆఫ్రికాకు చెందిన డాన్ మాస్.. గాబీమాస్ ఎస్టర్‌హుయిజెన్ కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహతుల మధ్య.. మార్చి 21న పెళ్లి  చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈలోపు ప్రపంచంపై కరోనా వైరస్ పంజా విసిరింది. ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ బాటపట్టాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు..వేడుకలు, జనసమూహాలపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. దీంతో డాన్ మాస్, గాబీమాస్ ఎస్టర్‌హుయిజెన్.. తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నారు.



ఈ క్రమంలో డాన్ మాస్ కూడా వైరస్ బారినపడ్డాడు. హాస్పటల్‌లో చేరి చికిత్స తీసుకున్నాడు. తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన డాన్ మాస్.. తన ప్రియురాలికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అట్టముక్కలతో తయారు చేసిన బొమ్మలను అతిథులుగా కుర్చోబెట్టి.. సన్నిహితులు ఐపాడ్ ద్వారా ఆన్‌లైన్‌లో వీక్షిస్తుండగా గాబీమాస్ ఎస్టర్‌హుయిజెన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని యూట్యూబ్ వీడియో ద్వారా డాన్ మాస్ వివరించాడు. వివాహం కోసం చేసిన ఏర్పాట్లు, పెళ్లి దృశ్యాలను.. యూట్యూబ్‌ వీడియోలో పొందుపరిచాడు. ఇప్పుడు ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 2.50లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ఇదిలా ఉంటే.. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో డిసెంబర్‌లో గాబీమాస్ ఎస్టర్‌హుయిజెన్‌ను మళ్లీ వివాహం చేసుకోనున్నట్లు డాన్ మాస్ వివరించాడు. 

Updated Date - 2020-04-10T23:10:43+05:30 IST