Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీ20 ప్రపంచకప్‌లో మరో రసవత్తర పోరు.. విండీస్‌పై టాస్ నెగ్గిన సౌతాఫ్రికా

దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య మరికాసేపట్లో పోరు ప్రారంభం కానుంది. టాస్ నెగ్గిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు చెరో మ్యాచ్ ఆడగా రెండు జట్లు ఓటమి పాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి ఖాతా తెరవాలని పట్టుదలగా ఉన్నాయి.


క్రిస్ గేల్, హెట్‌మెయిర్, పూరన్, కీరన్ పొలార్డ్, ఆండ్రూ రసెల్, బ్రావో, సిమన్స్, లూయిస్ వంటి ఆటగాళ్లతో విండీస్ జట్టు బలంగా కనిపిస్తుండగా, దక్షిణాఫ్రికా కూడా అంతే బలంగా ఉంది. అయిడెన్ మార్కరమ్, క్లాసీన్, డేవిడ్ మిల్లర్, తెంబా బవుమా, రీజా హెండ్రిక్స్, రబడ, నార్జ్, తబ్రైజ్ షంషీ వంటి ఆటగాళ్లతో ఆ జట్టు కూడా అంతే బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్ అభిమానులకు అసలైన మజా అందిస్తుందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement