Advertisement
Advertisement
Abn logo
Advertisement

దక్షిణాఫ్రికా మహిళకు హిందూ పురాణాలపై ఆసక్తి.. సత్యనారాయణ వ్రతంతో కష్టాలు తొలగించుకున్న వైనం

జొహన్నెస్‌బర్గ్‌, నవంబరు 24: ఆమె పేరు లూసీ సిగాబన్‌. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌కు చెందిన క్రైస్తవ మహిళ. 16 ఏళ్ల క్రితం వరకు అంతా బాగున్న ఆమె కుటుంబ ఆర్థిక స్థితి 2005లో ఒక్కసారిగా తల్లకిందులైంది. అప్పటికి ఏడాదిగా ఉద్యోగం లేని ఆమె.. కారు సహా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సత్యనారాయణ వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోతాయని ఎవరో చెప్పగా.. తన భర్త రాండాల్ఫ్‌తో కలిసి ఈ వ్రతాన్ని ఆచరించారు. అప్పుడు మొదలైంది ఆమెలో హిందూ పురాణాలపై ఆసక్తి. భారత్‌లో ఏడేళ్ల పాటు విష్ణుపురాణం, భగవద్గీత, నారాయణ పురాణం, వేదవేదాంగాలు, ఉపనిషత్తులను ఔపోసన పట్టారు. నాటి నుంచి  జొహన్నెస్‌బర్గ్‌‌లోని హిందూ కుటుంబాల్లో జరిగే పూజలు, పునస్కారాలు, శుభ, అశుభ కార్యక్రమాలన్నీ ఆమే నిర్వహించే వారు. విష్ణు సహస్రనామాలను దక్షిణాఫ్రికాలోని యువతకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ‘విష్ణు 1000 నేమ్స్‌’ పేరుతో ఓ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నగరంలోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు హాజరయ్యారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement