దక్షిణాఫ్రికాలో కరోనా కట్టడికి మళ్లీ మద్య నిషేధం

ABN , First Publish Date - 2020-07-13T15:47:50+05:30 IST

దక్షిణాఫ్రికాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో కరోనాను కట్టడి చేసేందుకు సోమవారం నుంచి మళ్లీ మద్యనిషేధం విధిస్తున్నట్లు...

దక్షిణాఫ్రికాలో కరోనా కట్టడికి మళ్లీ మద్య నిషేధం

జోహన్నెస్ బర్గ్ (దక్షిణాఫ్రికా) : దక్షిణాఫ్రికాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో కరోనాను కట్టడి చేసేందుకు సోమవారం నుంచి మళ్లీ మద్యనిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ప్రకటించారు. మద్య నిషేధంతోపాటు రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కర్ఫ్యూను కూడా విధిస్తున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు చెప్పారు. దక్షిణాఫ్రికా దేశంలో కరోనా కట్టడి కోసం మార్చి నెలాఖరు నుంచి లాక్ డౌన్ విధించడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ప్రపంచంలోనే కరోనా వ్యాప్తిలో 4వ స్థానంలో దక్షిణాఫ్రికా నిలిచింది. కరోనా కేసులు పెరుగుతున్నందున మద్య నిషేధం విధించామని అధ్యక్షుడు చెప్పారు. మద్యనిషేధంతోపాటు రాత్రి పూట కర్ఫ్యూ విధించిన సర్కారు అందరూ మాస్క్ లు ధరించాలని కోరింది. సామాజిక కార్యక్రమాలు, కుటుంబసభ్యుల పర్యటనలను కూడా దక్షిణాఫ్రికా సర్కారు నిషేధించింది. దక్షిణాఫ్రికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,76,242 కుచేరింది. 

Updated Date - 2020-07-13T15:47:50+05:30 IST