కలకత్తా : పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న కేంద్ర Homeminister Amith shah టీమిండియా మాజీ కెప్టెన్, BCCI ప్రస్తుత అధ్యక్షుడు Saurav Ganguly ఇంట్లో శుక్రవారం రాత్రి(ఈ రోజు) డిన్నర్ చేశారు. అమిత్ షా మర్యాదపూర్వకంగా తన ఇంటికి విచ్చేశారని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని గంగూలీ వివరించారు. అమిత్ షా కొడుకు జయ్ షా బీసీసీఐ హానరరీ సెక్రటరీగా కొనసాగుతుండగా, గంగూలీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ సహచరులు కావడంతో గంగూలీ ఇంటికి అమిత్ షా వెళ్లారు.
బాడీగార్డుల చుట్టుముట్టిన తెల్లటి ఎస్‌యూవీలో అమిత్ షా గంగూలీ ఇంటికి చేరుకున్నారు. అమిత్ షాను చూసేందుకు గంగూలీ ఇంటి వెలుపల జనాలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కారు ముందు సీట్లో ఉన్న అమిత్ షా జనాలకు అభివాదం చేస్తూ గంగూలీ ఇంట్లోకి వెళ్లారు. ఆ తర్వాత గంగూలీ కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ చేశారు. తమ భేటీలో రాజకీయాంశాలు ప్రస్తావనకు రాలేదని గంగూలీ చెప్పారు. తాము మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయన్నారు. 2008 నుంచి అమిత్ షా తనకు తెలుసునని, క్రికెట్ టూర్‌లో ఉన్నప్పుడు కలిశానని గంగూలీ గుర్తుచేసుకున్నారు. దశాబ్దకాలంగా అమిత్ షా తనకు తెలుసునని, పలుమార్లు కలుసుకున్నాం కూడా అని ప్రస్తావించాడు.