గంగూలీ, ద్రవిడ్‌ల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు నేటికి 21 ఏళ్లు

ABN , First Publish Date - 2020-05-26T21:10:41+05:30 IST

క్రికెట్ ప్రపంచకప్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులు నెలకొంటాయి. ఇండియన్ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని అలాంటి ఓ రికార్డు.. 21 సంవత్సరాల క్రితం

గంగూలీ, ద్రవిడ్‌ల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు నేటికి 21 ఏళ్లు

క్రికెట్ ప్రపంచకప్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులు నెలకొంటాయి. ఇండియన్ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని అలాంటి ఓ రికార్డు.. 21 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే.. 26 మే 1999న చోటు చేసుకుంది. ఆ ఏడాది శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో గంగూలీ, ద్రవిడ్‌ల జోడీ కలిసి 318 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి.. భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు. ఫలితంగా అప్పటివరకూ వన్డేల్లో 300లకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు అదే తొలిసారి.


అప్పటికే టోర్నీలో కేవ‌లం కెన్యాపై గెలిచిన భార‌త్.. ద‌క్షిణాఫ్రికా జింబాబ్వే చేతుల్లో ఓడిపోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. అయితే శ్రీలంకతో జరిగిన చావోరేవోలాంటి మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగింది. కానీ, తొలి ఓవర్‌లోనే శఠగోపన్ రమేశ్ వికెట్ కోల్పోయింది. దీంతో మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ద్రవిడ్‌తో కలిసి.. గంగూలీ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. గంగూలీ తన కెరీర్‌లోనే అత్యధిక స్కోర్ 183 పరుగులు చేయగా.. ద్రవిడ్ 145 పరుగులు చేశారు. దీంతో భారత్ 373 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది.


అనంతరం బౌలింగ్‌లో రాబిగ్ సింగ్ ఐదు వికెట్లు పడగొట్టడంతో ఈ మ్యాచ్‌లో భారత్ 157 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా ర‌న్‌రేట్‌ను మెరుగుప‌ర్చుకున్నభార‌త్.. సూప‌ర్ సిక్స్‌కు అర్హ‌త సాధించింది.

Updated Date - 2020-05-26T21:10:41+05:30 IST