రేపు Saurav Ganguly 50వ పుట్టిన రోజు.. ముందే మొదలైన సెలబ్రేషన్స్..

ABN , First Publish Date - 2022-07-08T03:24:45+05:30 IST

బీసీసీఐ ప్రస్తుత చీఫ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జులై 8న(రేపు) 50వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అయితే రెండు రోజుల

రేపు Saurav Ganguly 50వ పుట్టిన రోజు.. ముందే మొదలైన సెలబ్రేషన్స్..

ముంబై : బీసీసీఐ(BCCI) ప్రస్తుత చీఫ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Saurav Ganguly) జులై 8న(రేపు) 50వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అయితే ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా రెండు రోజుల ముందే దాదా పుట్టినరోజు వేడుకలను మొదలుపెట్టారు. ట్విటర్‌లో గురువారం ఆయనొక ఫొటోని షేర్ చేశారు. ఈ ఫొటోలో సౌరవ్ గంగూలీ, ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్(Sachin Tendulkar), బీసీసీఐ సెక్రటరీ జయ్ షా‌(Jay Shah)లతోపాటు రాజీవ్ శుక్లా(Raajiv sukla) కూడా ఉన్నారు. ‘‘ సౌరవ్ గంగూలీ 50వ పుట్టినరోజు వేడుక. సౌరవ్‌కి హ్యాపీ బర్త్‌డే. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తున్నా’’ అని రాజీవ్ శుక్లా క్యాప్షన్ ఇచ్చారు. కాగా టీమిండియా ఇంగ్లండ్‌(England)లో ఉండడంతో సౌరవ్ గంగూలీ అక్కడే ఉన్నాడు. రీషెడ్యూల్డ్ అయిన  ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఓడిన భారత జట్టు.. వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.


ఇదిలావుండగా సచిన్ తెందుల్కర్, సౌరవ్ గంగూలీకి ఇంగ్లండ్‌ గడ్డపై కొన్ని గుర్తుండిపోయే క్రికెట్ జ్ఞాపకాలు ఉన్నాయి. టెస్టులు, వన్డేల్లో ఇరువురూ పరుగులు నమోదు చేశారు. 2007లో ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ గెలిచిన జట్టులో వీరిద్దరూ సభ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో రాహుల్ ద్రావిడ్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక 2002లో నాట్‌వెస్ట్ ట్రోఫీ గెలిచిన జట్టులో కూడా వీరిద్దరూ సభ్యులుగా ఉన్నారు. వన్డేల్లో గంగూలీ, సచిన్ భాగస్వామ్యం ప్రపంచ రికార్డ్ బద్ధలు కొట్టింది. ఈ 176 ఇన్నింగ్స్‌ల్లో 47.55 సగటుతో ఉమ్మడిగా 8227 పరుగులు చేసింది.  26 మ్యాచుల్లో వంద పరుగులకిపైగా భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం.

Updated Date - 2022-07-08T03:24:45+05:30 IST