Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 04 Dec 2021 00:00:00 IST

ఓ సూప్‌ చూద్దామా

twitter-iconwatsapp-iconfb-icon
ఓ సూప్‌ చూద్దామా

చలి తీవ్రత పెరుగుతోంది. ఈ సమయంలో వేడి వేడి సూప్‌లు తాగితే ఒంట్లో వేడితో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది. 

బీర, బెండ, ఉల్లిపాయ, గుమ్మడికాయలతో చేసే ఈ సూప్‌ల రుచులను మీరూ ఆస్వాదించండి.



ఓ సూప్‌ చూద్దామా

బీరకాయ సూప్‌

కావలసినవి

బీరకాయ - అరకేజీ, ఉల్లిపాయలు - మూడు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, నల్లమిరియాలు - నాలుగైదు, పుదీనా - ఒకకట్ట, ఉప్పు - తగినంత.


తయారీ విధానం

  బీరకాయను శుభ్రంగా కడిగి కట్‌ చేసుకోవాలి. రెండు ఉల్లిపాయలను తరగాలి. వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలను, మిరియాలను కుక్కర్‌లో తీసుకోవాలి. రెండు కప్పుల నీళ్లు పోసి ఒక విజిల్‌ వచ్చే వరకు పెద్ద మంటపై ఉడికించాలి. తరువాత చిన్నమంటపై పావుగంటపాటు ఉడకనివ్వాలి. 

 ఆవిరిపూర్తిగా పోయిన తరువాత తీసి మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. తరువాత వడగట్టుకోవాలి. 

 ఈ సూప్‌ను మరో పాన్‌లోకి తీసుకుని స్టవ్‌పై పెట్టి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. సూప్‌ చిక్కదనాన్ని బట్టి నీళ్లు కలుపుకోవాలి. 

 పుదీనా ఆకులు, తరిగిన ఉల్లిపాయలతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

ఓ సూప్‌ చూద్దామా


గుమ్మడికాయతో...

కావలసినవి

పసుపు రంగు గుమ్మడికాయ - అరకేజీ, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - రెండు, వేగించిన జీలకర్ర - పావుటీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కరివేపాకు - ఒక కట్ట.

తయారీ విధానం

 గుమ్మడికాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత కుక్కర్‌లో వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి పదినిమిషాల పాటు ఉడికించాలి.

 కుక్కర్‌లో ఆవిరి పోయిన తరువాత తీసి మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. 

 ఈ సూప్‌ని మళ్లీ పాన్‌లో తీసుకుని స్టవ్‌పై పెట్టి మరిగించాలి. కరివేపాకు వేసి దింపుకోవాలి. 

 వేడివేడిగా తీసుకుంటే గుమ్మడికాయ సూప్‌ రుచిగా ఉంటుంది.


ఓ సూప్‌ చూద్దామా

బెండకాయ సూప్‌

కావలసినవి

బెండకాయలు - పన్నెండు, బీన్స్‌ - అరకప్పు, సొరకాయ ముక్కలు - ఒక కప్పు, క్యారెట్‌ - ఒకకప్పు, తరిగిన ఉల్లిపాయలు - అరకప్పు, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - ఒకటి, నల్లమిరియాలు - ఒకటేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.

తయారీ విధానం

 ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి, తడిలేకుండా ఆరిన తరువాత చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. 

 సొరకాయముక్కలు, క్యారెట్‌, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, బీన్స్‌ను కుక్కర్‌లో వేసి మూడు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించుకోవాలి.

 ఆవిరి పోయిన తరువాత కుక్కర్‌ మూత తీసి పాత్రలోకి నీళ్లు వడగట్టాలి. ఆ నీళ్లలో మరో కప్పు నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టి మరిగించాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు మరిగించుకున్న తరువాత స్టవ్‌పై నుంచి దింపుకోవాలి. మిరియాల పొడి చల్లుకుని వేడి వేడి సూప్‌ సిప్‌ చేయాలి.


ఓ సూప్‌ చూద్దామా

ఉల్లిపాయతో...

కావలసినవి

ఉల్లిపాయలు - పది, వెల్లుల్లి రెబ్బలు - మూడు, అల్లం - చిన్నముక్క, నల్లమిరియాలు - ఆరు, ఉప్పు - తగినంత, నెయ్యి - రెండు టీస్పూన్లు, నిమ్మరసం - పావు టీస్పూన్‌.

తయారీ విధానం

ఉల్లిపాయల పొట్టు తీసి శుభ్రంగా కడగాలి. ఒక ఉల్లిపాయను పక్కన పెట్టి మిగిలిన తొమ్మిది ఉల్లిపాయలను సన్నగా తరగాలి.  వెల్లుల్లి రెబ్బలను దంచుకోవాలి. 

 ఒక మందపాటి పాన్‌లో నాలుగు కప్పుల నీళ్లు పోసి తరిగిన ఉల్లిపాయలు వేసి ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. తరువాత స్టవ్‌పై నుంచి దింపుకొని చల్లారబెట్టుకోవాలి. 

 సూప్‌ చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. తరువాత జాలీ సహాయంతో వడగట్టుకోవాలి.

 ఇప్పుడు చిన్నమంటపై మరో పావుగంటపాటు మరిగించాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకుని దింపుకోవాలి.

 స్టవ్‌పై మరో పాన్‌ పెట్టి నెయ్యి వేసి ఉల్లిపాయలను వేగించాలి. 

 ఈ ఉల్లిపాయలతో సూప్‌ను గార్నిష్‌ చేసుకోవాలి. నిమ్మరసం పిండుకుని వేడి వేడి సూప్‌ను సర్వ్‌ చేసుకోవాలి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.