వాహనాలకు హారన్‌గా సంగీత వాయిద్యాల శబ్ధం

ABN , First Publish Date - 2021-10-05T16:08:19+05:30 IST

వాహనాలకు హారన్‌గా భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాన్ని ఉపయోగించేలా చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు...

వాహనాలకు హారన్‌గా సంగీత వాయిద్యాల శబ్ధం

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి

నాసిక్ : వాహనాలకు హారన్‌గా భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాలను ఉపయోగించేలా చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో జరిగిన జాతీయ రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.తాను అంబులెన్స్‌లు, పోలీసు వాహనాలు ఉపయోగించే సైరన్‌లను కూడా అధ్యయనం చేస్తున్నానని, వాటి స్థానంలో ఆల్ ఇండియా రేడియోలో ప్లే చేసే మరింత ఆహ్లాదకరమైన ట్యూన్‌ను అమర్చాలని యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వీఐపీ వాహనాలపై ఎర్ర లైట్లను ఇప్పటికే తొలగించామని, ఇప్పుడు సైరన్లను కూడా తొలగించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.


ఆకాశవాణిలో ఓ కళాకారుడు ట్యూన్ చేసిన మ్యూజిక్ ను అంబులెన్సుల కోసం ఉపయోగించాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి చెప్పారు. అంబులెన్స్ సైరన్ లు చిరాకు కలిగిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ఆహ్లాదకరంగా వినిపించే ట్యూన్లను వాహనాల సైరన్లకు ఉపయోగిస్తే బాగుంటుందని మంత్రి చెప్పారు. వేణువు, తబలా, వయోలిన్, మౌత్ ఆర్గాన్, హార్మోనియంలతో చేసే ట్యూన్లను వాహనాలకు హారన్లుగా తీసుకువస్తామని మంత్రి గడ్కరీ వివరించారు.దేశంలో ప్రతి సంవత్సరం 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయని, 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, లక్షల మంది గాయపడ్డారని మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. 


Updated Date - 2021-10-05T16:08:19+05:30 IST