సొరకాయ - పెసర్లతో... చీలా

ABN , First Publish Date - 2021-07-10T18:12:12+05:30 IST

పెసర్లు - ఒక కప్పు, బియ్యప్పిండి - ఒక టేబుల్‌స్పూన్‌, సొరకాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లం ముక్క - చిన్నది, కొత్తిమీర - ఒక కట్ట, ఇంగువ - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - రెండు టీస్పూన్లు.

సొరకాయ - పెసర్లతో... చీలా

కావలసినవి: పెసర్లు - ఒక కప్పు, బియ్యప్పిండి - ఒక టేబుల్‌స్పూన్‌, సొరకాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లం ముక్క - చిన్నది, కొత్తిమీర - ఒక కట్ట, ఇంగువ - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - రెండు టీస్పూన్లు. 


తయారీ విధానం: పెసర్లను ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత నీటిని తీసివేసి మిక్సీలో వేసి అల్లం, పచ్చిమిర్చి వేసి మెత్తటి మిశ్రమంలా పట్టుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. మిశ్రమం కాస్త గట్టిగా ఉండేలా పట్టుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలను గ్రైండ్‌ చేసి పెసర మిశ్రమంలో కలుపుకోవాలి. కొత్తిమీర, ఇంగువ, బియ్యప్పిండి, తగినంత ఉప్పు వేయాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవచ్చు. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక దోశలా పోసుకోవాలి. నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. టొమాటో చట్నీ లేదా కొబ్బరి చట్నీతో వేడి వేడి పెసర చీలాలు వడ్డించుకోవాలి.



Updated Date - 2021-07-10T18:12:12+05:30 IST