కావలసినవి: సొరకాయ - ఒకటి, పెసరపప్పు - పావుకప్పు, పసుపు - అర టీస్పూన్, కొబ్బరి తురుము - పావుకప్పు, జీలకర్ర - ఒక టీస్పూన్, కారం - ఒక టేబుల్‌స్పూన్, నూనె - సరిపడా, ఆవాలు - అర టీస్పూన్, మినప్పప్పు - ఒక టీస్పూన్, ఎండుమిర్చి - ఒకటి, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - రెండు రెమ్మలు.
తయారీ విధానం: సొరకాయ ముక్కలు, పెసరపప్పును కుక్కర్లో వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి తురుము, జీలకర్ర, కారంను మిక్సీలో వేసి పేస్టులా పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన సొరకాయ, పెసరపప్పు మిశ్రమంలో కలుపుకొని, మళ్లీ స్టవ్‌పైన పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించి దింపుకోవాలి. స్టవ్‌పై మరో పాత్ర పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు, మినప్పప్పు వేసి వేయించాలి. ఇంగువ, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేయాలి. ఈ పోపు మిశ్రమాన్ని సొరకాయ మిశ్రమంలో కలుపుకొంటే కర్రీ రెడీ.