May 14 2021 @ 07:17AM

సూర్య సినిమాకు మ‌రో అరుదైన గుర్తింపు

కోలీవుడ్ హీరో సూర్య‌కు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఈయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన త‌మిళ చిత్రం ‘శూర‌రై పోట్రు’(ఆకాశం నీ హ‌ద్దురా)కు అరుదైన గుర్తింపు ద‌క్కింది. ఈ సినిమా షాంఘై ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ ఫెస్టివ్‌(ఎస్ఐఎఫ్ఎఫ్‌)లో ప్ర‌ద‌ర్శితం కానుంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి జూన్ 20వ‌ర‌కు జ‌రిగే చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఈ చిత్రాన్ని ప‌నోర‌మ విభాగంలో ఎంపిక చేశారు. ‘ఆకాశం నీ హ‌ద్దురా’ చిత్రం మ‌న‌దేశం త‌ర‌పున ఈ చిత్రం 93వ ఆస్కార్ నామినేష‌న్స్ ప‌రిశీల‌న‌కు ఎంపికైన సంగ‌తి తెలిసిందే. అలాగే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు కూడా ఈ సినిమా ఎంపికైంది. ఇప్పుడు మ‌రో అంత‌ర్జాతీయ సినీ చిత్రోత్స‌వానికి ఎంపిక కావ‌డం విశేషం. సుధా కొంగ‌ర ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.  గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో  ‘శూర‌రై పోట్రు’(ఆకాశం నీ హ‌ద్దురా) అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లై మంచి ప్రశంసలను అందుకున్న సంగ‌తి తెలిసిందే.