Abn logo
Aug 7 2020 @ 12:12PM

నేనూ సుశాంత్‌లా అయిపోతానని భయపడుతున్నారు: యువ హీరో

ఇటీవల మరణించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్యకు హీరో సూరజ్ పంచోలి కారణమని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. గతంలో హీరోయిన్ జియా ఖాన్ మృతికి కారణమైన సూరజ్‌కు దిశ మరణంలో కూడా కీలక పాత్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సూరజ్ ఆ వార్తలపై స్పందించాడు. 


`దిశా సలియన్‌ అనే అమ్మాయిని నేను ఇంత వరకు కలవలేదు. దయచేసి నన్ను ఇందులోకి లాగొద్దు. ఇప్పటికే నా మీద ఓ కేసు నడుస్తోంది. దాని వల్ల ఇండస్ట్రీలో అతి కొద్ది మంది మాత్రమే నాతో కలిసి పని చేస్తున్నారు. ఇలాంటి వార్తల వల్ల నా జీవితం మరింత నాశనం అవుతుంది. నా విషయంలో నా తల్లిదండ్రులు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. సుశాంత్‌ ఆత్మహత్య గురించి తెలిసి మా అమ్మ ఎంతో భయపడింది. నేను కూడా అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటానేమోనని ఆమె ఆందోళన చెందుతోంద`ని సూరజ్ అన్నాడు.

Advertisement
Advertisement
Advertisement