సెల్ఫ్ ఐసోలేషన్‌పై సమగ్ర వీడియో... సోనీ బీబీసీ ఎర్త్‌లో ప్రసారం
ABN , First Publish Date - 2020-04-10T23:59:08+05:30 IST
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో అందరికీ తెలిసిన విషయమే. దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే...
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో అందరికీ తెలిసిన విషయమే. దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఒక్కటే మార్గం.. అదే సెల్ఫ్ ఐసోలేషన్. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. ఎప్పుడూ ఏదో పనిమీద తిరుగుతూ ఉండేవారు ఒక్కసారిగా ఇంట్లో కదలకుండా కూర్చోవాలంటే అంత సులువేం కాదు. దీని వల్ల కొందరిలో మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అయితే దీనికి పరిష్కారంగా సోనీ బీబీసీ ఎర్త్ గంట నిడివి గల ఓ డాక్యూ-ఫిలింను ప్రసారం చేయనుంది. ‘కరోనా వైరస్-హౌ టూ ఐసోలేట్ యువర్సెల్ఫ్’ పేరుతో విడుదల చేస్తున్న ఈ వీడియోను ఇంగ్లాండ్ జనరల్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ప్రముఖ డాక్టర్ గ్జాండ్ వాన్ తుల్లెకిన్, సైకాలజిస్ట్ కింబర్లీ విల్సన్‌లు సంయుక్తంగా రూపొందించారు. ఈ వీడియోలో వాన్ తుల్లెకిన్ ఎందరో నిపుణులను కలిసి కరోనాను ఎలా ఎదుర్కోవాలి, కరోనాను నియంత్రించడంలో సెల్ఫ్ ఐసోలేషన్ ముఖ్య పాత్ర పోషించడానికి కారణమేంటి.. అనే విషయాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. అంతేకాకుండా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నవారు ఎదుర్కొనే సమస్యలను గురించి కూడా సమగ్రంగా చర్చిస్తారు.
మానసిక సమస్యలపైనా దృష్టి..
సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న వారు ఎదుర్కొనే మానసిక సమస్యలపై డాక్టర్ కింబర్లీ ఈ వీడియోలో వివరిస్తారు. ఆందోళన, చికాకువంటి మానసిక సమస్యలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తారు.
ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో పాటు కరోనా గురించి ప్రచారంలో అవాస్తవాలు కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తాయని, లేనిపోని అనుమానాలను కలిగిస్తాయని, అటువంటి అనుమానాలను తొలగించేందుకే తాము ఈ డాక్యూ-ఫిలింను ప్రసారం చేస్తున్నామని సోనీ బీబీసీ తెలిపింది. 13 ఏప్రిల్ రాత్రి ప్రతి రోజూ సోనీ బీబీసీ ఎర్త్ చానల్లో ప్రసారమవుతుందని సంస్థ వివరించింది.