Abn logo
Sep 28 2020 @ 16:30PM

ఫీజుల కోసం ఒత్తిడి చేయకండి: సోనూసూద్ సూచన

Kaakateeya

లాక్‌డౌన్ సమయంలో తనలోని మానవీయ కోణాన్ని బయటపెట్టి అందరి చేతా హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. వలస కార్మికులకు, పేదలకు, అవసరంలో ఉన్నవారికి, పేద విద్యార్థులకు తన వంతు సహాయం చేశాడు. తాజాగా ప్రైవేట్ స్కూళ్ల, కాలేజీల యాజమాన్యాలకు ట్విటర్ ద్వారా ఓ విజ్ఞప్తి చేశాడు. ఫీజుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయ్యొద్దని సూచించాడు. 


`అన్ని పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలకు ఓ విజ్ఞప్తి చేస్తున్నా. విద్యార్థులను ఫీజల కోసం ఒత్తిడి చేయకండి. ఫీజులు కట్టని విద్యార్థుల ఆన్‌లైన్ క్లాసులను ఆపేయకండి. వారికి కొంత సమయం ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న సహాయం ఎంతో మంది కెరీర్లను కాపాడుతుంద`ని ట్వీట్ చేశాడు. అలాగే టీచర్స్, పాఠశాలలు కూడా మనుగడ సాగించాలి కాబట్టి ఫీజుల కట్టే స్తోమత ఉన్న పేరెంట్స్ వెంటనే ఫీజులు కట్టెయ్యాలని సూచించాడు. 



Advertisement
Advertisement