సోనూసూద్‌పై రైనా ప్రశంసల వర్షం.. ధన్యవాదాలు చెప్పిన సోనూ

ABN , First Publish Date - 2020-05-28T02:21:14+05:30 IST

కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీలకు సోనూసూద్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. కరోనా కకాలవికలంతో అస్తవ్యస్తమైన వలస

సోనూసూద్‌పై రైనా ప్రశంసల వర్షం.. ధన్యవాదాలు చెప్పిన సోనూ

ముంబై: కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీలకు సోనూసూద్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. కరోనా కకాలవికలంతో అస్తవ్యస్తమైన వలస జీవులను సొంతూర్లకు తరలించేందుకు ఈ బాలీవుడ్ యాక్టర్ సొంత ఖర్చుతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు తీసుకోని వేలాది మంది వలస కూలీలను వారి సొంతూళ్లకు పంపించాడు.


సోనూ చేస్తున్న ఈ పనిపై టీం ఇండియా ఆల్ రౌండర్ సురేశ్ రైనా ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘ఈ ఆపాద కాలంలో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారిని తమ సొంత ప్రాంతాలకు పంపించేందుకు సోనూసూర్ రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. సోనూ నువ్వు చేస్తున్న ఈ పనిని దేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది’’ అంటూ రైనా ట్వీట్ చేశాడు. దీనిపై సోనూ కూడా స్పందించాడు. ‘‘చాలా ధన్యవాదాలు సోదరా. నువ్వు మా అందరికీ ఆదర్శం’’ అంటూ సోనూ పేర్కొన్నాడు. 

Updated Date - 2020-05-28T02:21:14+05:30 IST