Abn logo
Sep 17 2020 @ 10:13AM

సమాజానికి తిరిగి ఇవ్వకపోతే..: సోనూ సూద్

కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటూ వందలు, వేల కోట్ల ఆస్తులు వెనకేసుకున్న స్టార్‌లే ఆశ్చర్యపోయే రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు నటుడు సోనూ సూద్. కరోనా కష్టకాలంలో నేనున్నానంటూ పేదలకు, వలస కార్మికులకు అండగా నిలిచాడు. 


సమాజంలోని ప్రధాన సమస్యలను గుర్తించి తన వంతు సహాయం చేస్తున్నాడు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించేందుకు కూడా ముందుకు వచ్చాడు. ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవిస్తున్న సోనూ తాజాగా చేసిన ఓ వ్యాఖ్య నెటిజన్లలో స్ఫూర్తిని రగిలిస్తోంది. `సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వకపోయినట్టైతే.. నేను మంచి జీవితాన్ని అనుభవిస్తున్నట్టు కాద`ని సోనూ పేర్కొన్నాడు. 

Advertisement
Advertisement
Advertisement