గన్నవరం ఎయిర్‎పోర్ట్ చేరుకున్న సోనూసూద్

ABN , First Publish Date - 2021-09-09T13:35:47+05:30 IST

బాలీవుడ్ నటుడు సోనూసూద్ హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‎పోర్ట్‎కు చేరుకున్నారు. సోనూసూద్‎కి ఎయిర్‎పోర్టులో బీజేపీ నేతలు ఘనస్వాగతం

గన్నవరం ఎయిర్‎పోర్ట్ చేరుకున్న సోనూసూద్

కృష్ణా: బాలీవుడ్ నటుడు సోనూసూద్ హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‎పోర్ట్‎కు చేరుకున్నారు. సోనూసూద్‎కి ఎయిర్‎పోర్టులో బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో సోనూసూద్ సెక్యూరిటీ కోసం వచ్చిన బౌన్సర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‎పోర్ట్ వద్ద పోలీసులు పనితీరుపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు సోనూసూద్‌ను చూడడానికి వచ్చిన అభిమానులకు ఎయిర్‎పోర్ట్ వద్ద నిరాశ ఎదురైంది.

Updated Date - 2021-09-09T13:35:47+05:30 IST