Abn logo
Sep 18 2020 @ 12:04PM

ఎమ్మెల్యే టికెట్ కావాలన్న నెటిజన్‌.. సోనూ ఫన్నీ రిప్లై!

Kaakateeya

వెండితెర మీద విలన్ పాత్రలు పోషించిన సోనూసూద్‌ రియల్ హీరో అని దేశం మొత్తం గుర్తించింది. పలు సమస్యలపై దృష్టి సారించి తన వంతు సహాయం చేయడానికి సోనూ ముందుకొస్తున్నాడు. దీంతో కొందరు సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను సోనూకు విన్నవించుకుని సహాయం అడుగుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఫన్నీ ట్వీట్లు కూడా చేస్తున్నారు. 


తాజాగా ఓ నెటిజన్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించమని సోనూను కోరాడు. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయడానికి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించమని అడిగాడు. దీనికి స్పందించిన సోనూ అంతే ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. `బస్సు, రైలు, విమానం టికెట్లు తప్ప వేరే టికెట్లు ఇప్పించడం తెలియదు బ్రదర్` అని రిప్లై ఇచ్చాడు. సోనూ రిప్లై నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 



Advertisement
Advertisement
Advertisement