పసి ప్రాణానికి సోనూ బాసట

ABN , First Publish Date - 2021-01-24T08:56:56+05:30 IST

నటుడు సోనూసూద్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. హృద్రోగంతో బాధపడుతున్న ఓ చిన్నారికి ప్రాణం పోశారు.

పసి ప్రాణానికి సోనూ బాసట

తాళ్లపూడి, జనవరి 23: నటుడు సోనూసూద్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. హృద్రోగంతో బాధపడుతున్న ఓ చిన్నారికి ప్రాణం పోశారు. పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన రామన వెంకటేశ్వరరావు, దేవి కూలీలు. వారి ఎనిమిది నెలల కుమారుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యానికి తగిన స్థోమత లేక తల్లిదండ్రులు బిడ్డపై ఆశలు వదులుకున్నారు. ఈ లోపు అదే గ్రామానికి చెందిన దివంగత టీడీపీ మాజీ మండలాధ్యక్షుడు కొఠారు శ్రీనివాస్‌ కుమారుడు బాలుడి పరిస్థితి గురించి నటుడు సోనూసూద్‌ ట్రస్టును సంప్రదించారు. ట్రస్టు పిలుపు మేరకు బాధిత తల్లిదండ్రులు ముంబై వెళ్లి తమ కష్టాన్ని విన్నవించారు. చలించిన సోనూసూద్‌ వెంటనే బాలుడిని ముంబై నారాయణ హృదాలయ ఆస్పత్రిలో చేర్పించారు. రూ.6 లక్షల వ్యయంతో బాలుడికి గుండె ఆపరేషన్‌ చేయించగా కోలుకున్నాడు.  

Updated Date - 2021-01-24T08:56:56+05:30 IST