చదును చేస్తున్న పోకూరు - శింగమనేనిపల్లె రోడ్డు
వలేటివారిపాలెం, జూలై 1: మండలంలోని పోకూరు నుంచి శింగమనేనిపల్లె వెళ్లే రోడ్డుకు పోకూరుకు చెందిన నవ్వులూరి సుబ్బానాయుడు తన సొంత నిధులతో గ్రావెల్ తోలారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రోడ్డులో మోకాటిలోతు గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుబ్బానాయుడు తన సొంత నిధులతో రహదారిపై ఏర్పడిన గుంతల్లో గ్రావెల్ వేసి మరమ్మతులు చేపట్టారు.