సోనియా గాంధీకి కోవిడ్-19 పాజిటివ్

ABN , First Publish Date - 2022-06-02T19:01:03+05:30 IST

మనీ లాండరింగ్ కేసులో బుధవారం సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు పంపింది. రాహుల్‌ను ఈరోజు విచారించనుండగా.. సోనియాను మాత్రం ఈ నెల 8వ తేదీన విచారించనున్నారు. అయితే సోనియాకు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఈడీ విచారణకు హాజరవుతారా అనే..

సోనియా గాంధీకి కోవిడ్-19 పాజిటివ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత(Congress President) సోనియా గాంధీ(Sonia Gandhi)కి కొవిడ్-19 పాజిటివ్(Covid-19 positive) అని తేలిందని ఆ పార్టీ గురువారం ప్రకటించింది. దీంతో ఆమె సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లారని, కొద్ది రోజులు అక్కడే పూర్తి చికిత్స తీసుకుంటారని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా పేర్కొన్నారు. ‘‘ఆమెకు తేలికపాటి జ్వరం వచ్చింది. దీంతో పాటు మరికొన్ని లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం ఆమె సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అవసరమైన వైద్య, ఇతర సదుపాయాలు ఆమె ఉన్న చోటకే అందిస్తారు’’ అని సూర్జేవాలా అన్నారు.


మనీ లాండరింగ్ కేసులో బుధవారం సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు పంపింది. రాహుల్‌ను ఈరోజు విచారించనుండగా.. సోనియాను మాత్రం ఈ నెల 8వ తేదీన విచారించనున్నారు. అయితే సోనియాకు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఈడీ విచారణకు హాజరవుతారా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈడీ విచారణకు ఇంకా సమయం ఉందని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-06-02T19:01:03+05:30 IST