Sonia Gandhii ని ప్రశ్నిస్తున్న ఈడీ.. వెంటవెళ్లిన రాహుల్, ప్రియాంక గాంధీలు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

ABN , First Publish Date - 2022-07-21T17:59:16+05:30 IST

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. సోనియా వెంట ఆమె రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఉ

Sonia Gandhii ని ప్రశ్నిస్తున్న ఈడీ.. వెంటవెళ్లిన రాహుల్, ప్రియాంక గాంధీలు.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald Case)లో కాంగ్రెస్(Congress) అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)ని ఈడీ(ED) అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు సీఆర్‌పీఎఫ్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సోనియాకి తోడుగా కొడుకుకూతురు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)లు ఉన్నారు. అయితే వీరిద్దరూ ప్రత్యేక రూమ్‌లో వేవివుండాల్సి ఉంటుంది. సోనియా విచారించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.


అనారోగ్యంగా ఉంటే ఇంటికి వెళ్లిపోవచ్చు..

అనారోగ్యంగా అనిపిస్తే సోనియా గాంధీ ఇంటికి వెళ్లిపోవచ్చునని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అనారోగ్యం దృష్ట్యా ఒక మెడికల్ ఆఫీసర్‌ని కూడా ఈడీ కార్యాలయంలోకి అనుమతిస్తారు. అయితే విచారణ సమయంలో సోనియా పక్కన కూర్చుకోవడానికి వీల్లేదు. సోనియా గాంధీ లాయర్ కూడా ఆమె వెంట ఉండొచ్చు. కానీ విచారణలో ప్రశ్నలు సంధించే సమయంలో ఆమె పక్కన ఉండరాదని ఈడీ అధికారులు చెప్పారు. కాగా సోనియా గాంధీకి తోడుగా వెళ్లిన ప్రియాంక, రాహుల్ఈ డీ కార్యాలయంలోనే వేరే ప్రత్యేక రూంలో వేచివుండాల్సి ఉంటుంది. అదే రూంలో వైద్యుడు కూడా ఉంటారు. కాగా ఇటివలే కరోనా బారినపడిన సోనియా గాంధీ కొవిడ్ అనంతరం దుష్ర్పభావాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న వ్యక్తిని ఈడీ ప్రశ్నించడం ఇదే తొలిసారి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని దాదాపు 50 గంటలపాటు ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-07-21T17:59:16+05:30 IST