Sonia Gandhi mother Passed Away: సోనియా గాంధీ కుటుంబంలో విషాదం.. ఆమె తల్లి మైనో మృతి

ABN , First Publish Date - 2022-08-31T23:00:00+05:30 IST

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోనియా గాంధీ తల్లి పావోలా మైనో ఇటలీలోని..

Sonia Gandhi mother Passed Away: సోనియా గాంధీ కుటుంబంలో విషాదం.. ఆమె తల్లి మైనో మృతి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోనియా గాంధీ తల్లి పావోలా మైనో ఇటలీలోని ఆమె స్వగృహంలో ఆగస్ట్ 27న (శనివారం) తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఆగస్ట్ 28న జరిగినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో సోనియా గాంధీ కొన్ని రోజుల క్రితం ఇటలీకి వెళ్లారు.



కాంగ్రెస్‌ పార్టీ గత కొన్నాళ్లుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వరుస ఎన్నికల్లో పరాజయాలకు తోడు.. కీలక నేతలు పార్టీకి రాంరాం చెప్పడం వంటివి తీవ్రస్థాయిలో కుంగదీస్తున్నాయి. ఇక, ఈ ఏడాది మార్చిలో జరిగిన పార్టీ సమావేశంలో సోనియా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాహుల్‌, ప్రియాంక సహా తాను కూడా రాజీనామా చేయనున్నట్టు చెప్పారు. అయితే.. పార్టీ ఎన్నికల వరకు కొనసాగుతానని తెలిపారు.

Updated Date - 2022-08-31T23:00:00+05:30 IST