Sonia Gandhi శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్.. చికిత్స కొనసాగుతోంది: Congress

ABN , First Publish Date - 2022-06-17T22:00:11+05:30 IST

కరోనా(Corona) బారినపడ్డ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) తాజా ఆరోగ్య స్థితిని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వెల్లడించింది.

Sonia Gandhi శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్.. చికిత్స కొనసాగుతోంది: Congress

న్యూఢిల్లీ : కరోనా(Corona) బారినపడ్డ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) తాజా ఆరోగ్య స్థితిని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వెల్లడించింది. కొవిడ్ అనంతరం సోనియా శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్‌‌ను వైద్యులు గుర్తించారు. ఇన్ఫెక్షన్‌తోపాటు ఇతర కొవిడ్ అనంతర లక్షణాలకు చికిత్స కొనసాగుతోందని తెలిపింది. సోనియా ప్రస్తుతం ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇన్ఫెక్షన్ గుర్తించిన వెంటనే చికిత్స ఆరంభమైందని, గురువారం ఇందుకు సంబంధించిన వైద్య పక్రియలు మొదలయ్యాయని కాంగ్రెస్ ముఖ్య అధికారప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన జైరామ్ రమేష్ ప్రకటనలో పేర్కొన్నారు. దిగువ శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్‌ను గుర్తించారని వివరించారు. వైద్యుల పర్యవేక్షణ, చికిత్స కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా కొవిడ్ బారినపడ్డ సోనియా జూన్ 12 హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే.


రాహుల్‌కు సోమవారం వరకు ఈడీ మినహాయింపు

నేషనల్‌ హెరాల్డ్‌ మనీ లాండరింగ్‌ కేసులో వరుసగా మూడురోజులు విచారణను ఎదుర్కొన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ.. తదుపరి విచారణకు సోమవారం వస్తానని ఈడీని కోరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి సోనియా యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. శుక్రవారం విచారణకు రాలేనని, ఆపై రెండు రోజుల తర్వాత సోమవారం వస్తానని రాహుల్‌ కోరారు. ఇందుకు ఈడీ అధికారులు కూడా అంగీకరించారు. తిరిగి సోమవారం విచారణకు హాజరవ్వాలని సూచించారు. కాగా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు జూన్ 23న నోటీసులు అందాయి. విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈడీ కోరింది. ఇప్పటికే 3 రోజులపాటు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నించారు.

Updated Date - 2022-06-17T22:00:11+05:30 IST