సొనాటా సాఫ్ట్‌వేర్ పరుగులు

ABN , First Publish Date - 2021-08-06T01:59:45+05:30 IST

ప్రమఖ ఐటీ కంపెనీ సొనాటా సాఫ్ట్‌వేర్ షేర్లు మార్కెట్‌లో గురువారం మంచి ఫలితాలను సాధించాయి.

సొనాటా సాఫ్ట్‌వేర్ పరుగులు

ముంబై : ప్రమఖ ఐటీ కంపెనీ సొనాటా సాఫ్ట్‌వేర్ షేర్లు మార్కెట్‌లో గురువారం మంచి ఫలితాలను సాధించాయి. బీఎస్ఈలో ఇంట్రా డే ట్రేడ్‌లో 9 శాతం పెరిగి రూ. 884.05 కు చేరుకున్నాయి. దీంతో కంపెనీ ఇంట్రా-డే ట్రేడ్‌లో గురువారం బీఎస్‌ఈలో కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 86.7 కోట్ల ఏకీకృత నికర లాభంలో 74 శాతం వార్షికంగా పెరిగినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. దీంతో కంపెనీ షేర్లు ఒక్కసారిగా తారస్థాయికి చేరుకున్నాయి. వరుస ప్రాతిపదికన 2020- 2021 ఆర్థిక సంవత్సరం... నానలుగవ త్రమాసికంలో లాభం నాలుగు శాతం పెరిగింది. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 7.3 శాతం పెరుగుదలతో పోలిస్తే, గత ఆరు నెలల్లో 115 శాతం జూమ్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల సంస్థ మార్కెట్‌ను అధిగమించింది. 

Updated Date - 2021-08-06T01:59:45+05:30 IST